భానుడి భగభగలతో విలవిల
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:31 AM
భానుడి భగభగలతో నగర ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం
మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్న రోడ్లు
వడదెబ్బ తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు
సికింద్రాబాద్: భానుడి భగభగలతో నగర ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. ముందు ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి అధికం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అతి ముఖ్యమైన పని ఉంటేనే బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల నుంచి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి వైద్యులు సూచిస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలి
ఎండను తాళలేక కొందరు ఎక్కువ సార్లు స్నానం చేస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. శరీరం బలహీనపడుతుంది. ఒక్కోసారి శరీరం ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే దిగువకు పడిపోతాయి. దీంతో సృహకోల్పోవడం, ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేషన్‌కు గురికుండా ఉండేందుకు ఎక్కువ సార్లు నీరు తాగాలి.
- డాక్టర్ అజీద్ హూస్సేన్, మెడికల్ ఇన్‌చార్జి, శివాలయనగర్
ఇవి పాటించాలి..
ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి
ఎండలోకి తప్పనిసరిగా వెళ్లేవారు సన్‌స్ర్కీన్, లోషన్ తప్పనిసరిగా వాడాలి
ఎక్కువ దాహం వేస్తుంది కాబట్టి బయటకు వెళ్లేవారు వెంట మంచి నీరు తీసుకెళ్లాలంటున్నారు.
దాహర్తిని తీర్చేందుకు పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, శీతల పానీయాలు తాగడం ఆరోగ్యానికి మంచిది.
వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు ముఖ్యమైన పనులపై బయటికి వెళ్లేవారు తప్పని సరిగా తలకు టోపీ పెట్టుకోవాలని, గొడుగు వేసుకొని వెళ్లాలని, పాదరక్షలు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్, చేతికి గ్లౌజ్‌లు వేసుకోవాలి.
ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటికి రాకుండా చూసుకోవాలి
ఉదయం 8 గంటలలోపే పిల్లలకు స్నానాలు ముగించాలి
రోజుకు తప్పని సరిగా నాలుగు లీటర్ల నీరు తాగితే డీహైడ్రేషన్ నుంచి బయట పడవచ్చు
పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా పలుచని నూలు వస్త్రాలు ధరింపజేయాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
పెరిగిన పచ్చిమిర్చి, బెండ.. తగ్గిన టమోటా, వంకాయ
Read Latest Telangana News and National News