Share News

సునీల్‌ నాయక్‌ విచారణలో 7వ రోజూ అదే తీరు

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:28 AM

నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌ పోలీస్‌ విచారణకు సహకరించడంలేదు.

సునీల్‌ నాయక్‌ విచారణలో 7వ రోజూ అదే తీరు

  • ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పు నేడు

గుంటూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): నాటి నరసాపురం ఎంపీ, ప్రస్తుతం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌ పోలీస్‌ విచారణకు సహకరించడంలేదు. ఏడో రోజైన బుధవారం కూడా ఆయనను దర్యాప్తు అధికారి అయిన విజయనగరం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ విచారించారు. దర్యాప్తు అధికారి ప్రశ్నలకు సునీల్‌ నాయక్‌ మౌనం దాల్చారని తెలిసింది. గుంటూరులోని సీసీఎస్‌ పోలీస్‌ ేస్టషన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆయన ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. గురువారం కూడా సునీల్‌ నాయక్‌ గుంటూరులోని సీసీఎస్‌ పోలీస్‌ ేస్టషన్లో విచారణకు హాజరు కానున్నారు. కాగా, హైకోర్టులో సునీల్‌ నాయక్‌ ముందస్తు బెయిల్‌పై గురువారం తీర్పు రానుంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి సునీల్‌ నాయక్‌ను రిమాండ్‌కు పంపుతారా లేదా అనేది తేలనుంది.

Updated Date - Mar 12 , 2026 | 04:28 AM