హైకోర్టు అడ్వకేట్ కిడ్నాప్ కేసులో పిన్నెల్లి అనుచరుడు అరెస్టు
ABN , Publish Date - Mar 12 , 2026 | 10:53 AM
ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ను కిడ్నాప్ చేసి హింసించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2023 నవంబర్ 7వ తేదీన హైకోర్టు అడ్వకేట్‌ని నిర్భంధించి హింసించినట్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కర్నాటి వీరభద్రరావు, కర్నాటి సతీశ్‌లపై ఆరోపణలు ఉన్నాయి.
విజయవాడ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ను (AP High Court Advocate) కిడ్నాప్ చేసి హింసించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2023 నవంబర్ 7వ తేదీన హైకోర్టు అడ్వకేట్‌ని నిర్భంధించి హింసించినట్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కర్నాటి వీరభద్రరావు, కర్నాటి సతీశ్‌లపై ఆరోపణలు ఉన్నాయి. వారికి డీఎస్పీ పల్లంరాజు, ఎస్ఐ రబ్బానీ సహకరించారు.
తనపై దొంగ కేసు పెట్టి, కిడ్నాప్ చేసి చావు భయం చూపించి ఆస్తులు రాయించుకున్నట్లు హైకోర్టు అడ్వకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈరోజు ఏ1గా ఉన్న కర్నాటి వీరభద్రరావుని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే డీఎస్పీ పల్లంరాజు, ఎస్ఐ రబ్బానీ సస్పెన్షన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కర్నాటి వీరభద్రరావు, కర్నాటి సతీశ్‌లను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. వీరభద్రరావును అరెస్ట్ చేశారు. సతీశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వివేకా కేసు.. సునీత ఆ పిటిషన్ల తిరస్కరణ
భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు: మంత్రి అనగాని సత్యప్రసాద్
Read Latest International News And Telangana News And AP News And Telugu News