ఆ పరీక్షా షెడ్యూల్‌పై సీబీఎస్ఈ క్లారిటీ.. ఆ వార్తలు ఫేక్ అని స్పష్టం
ABN , Publish Date - Mar 12 , 2026 | 11:03 AM
సీబీఎస్ఈ పరీక్ష షెడ్యూల్‌పై సీబీఎస్ఈ స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారాలు అవాస్తవమని, ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయవద్దని హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ రోజు(మార్చి 12) జరగాల్సిన పరీక్షను రీషెడ్యూల్ చేశారనే ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని.. అది పూర్తిగా అవాస్తవమని సీబీఎస్ఈ అధికారులు స్పష్టం చేశారు. తమ బోర్డు తరఫున అలాంటి నోటీసులేవీ జారీ కాలేదని వారు చెప్పారు.
బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లలో 12వ తరగతి ఇంగ్లీష్ ఎగ్జామ్ సహా ఇతర పరీక్షల తేదీలను మార్చినట్లు కొందరు విద్యార్థులకు ఓ ఫేక్ మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్.. వాట్సాప్, ఇన్‌స్టా, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ అవుతూ.. తెగ వైరల్ అయింది. ఈ విషయం సీబీఎస్ఈ అధికారుల దృష్టికి వెళ్లింది. స్పందించిన బోర్డు.. ఆ సందేశంతో బోర్డుకు ఎలాంటి సంబంధం లేదంది. బోర్డు ధ్రువీకరించిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలు కూడా ఈ మెసేజ్‌ను ఫేక్ అని పేర్కొన్నాయి.
సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ వార్తలను షేర్ చేయొద్దని ఆయా యూజర్లను హెచ్చరించింది సీబీఎస్ఈ. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాలలకు విజ్ఞప్తి చేసింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించి అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేసింది. తమ ద్వారా ధ్రువీకరించిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది.
ఇవీ చదవండి:
హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..
ఆ ముగ్గురినీ పక్కన పెట్టండి.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు