హార్దిక్ పాండ్యాపై ఫిర్యాదు.. జాతీయ జెండాను అవమానించాడంటూ..
ABN , Publish Date - Mar 12 , 2026 | 09:03 AM
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారో వ్యక్తి. టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం సంబరాల్లో భాగంగా హార్దిక్ మువ్వన్నెల జెండాను అవమానించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 ప్రపంచకప్ విజయోత్సవాల సందర్భంగా హార్దిక్.. జాతీయ జెండాను అవమానించాడని, అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వాజిద్ ఖాన్ అనే న్యాయవాది పుణే పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయాన్ని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ధ్రువీకరించారు.
గత ఆదివారం న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం అనంతరం సంబరాల్లో భాగంగా హార్దిక్.. త్రివర్ణ పతాకాన్ని తన శరీరానికి చుట్టుకుని మైదానంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఖాన్ ఫిర్యాదు చేశారు. 'హార్దిక్ ఇలా చేయడం చట్టం ప్రకారం నేరం, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జాతీయ జెండా గౌరవాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి విధి' అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఖాన్.
కాగా.. టీమ్ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ కప్ గెలుపొందడంలో హార్దిక్ పాండ్య కీలకపాత్ర పోషించాడు. లీగ్ మ్యాచ్‌లో నమీబియాపై 28 బంతుల్లో 52 పరుగులు చేయడం సహా 2 అర్ధ సెంచరీలు సాధించాడు. అంతేకాకుండా బౌలింగ్‌లోనూ 9 వికెట్లతో రాణించి ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు హార్దిక్.
ఇవీ చదవండి:
ఆరంభ పోరులో.. బెంగళూరు, హైదరాబాద్ ఢీ
ఆ ముగ్గురినీ పక్కన పెట్టండి.. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదంపై సుప్రీం కోర్టు
ఎన్‌సీఈ