Share News

ఆరంభ పోరులో.. బెంగళూరు, హైదరాబాద్‌ ఢీ

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:43 AM

దేశవాళీ క్రికెట్‌ పండుగ ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తొలి అంచెలో ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు 10 వేదికల్లో జరిగే 20 మ్యాచ్‌ల...

ఆరంభ పోరులో.. బెంగళూరు, హైదరాబాద్‌  ఢీ

  • ఈ నెల 28 నుంచి ఐపీఎల్‌

  • తొలి అంచె షెడ్యూల్‌ విడుదల

  • లీగ్‌పై యుద్ధ ప్రభావం

ముంబై: దేశవాళీ క్రికెట్‌ పండుగ ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తొలి అంచెలో ఈ నెల 28 నుంచి ఏప్రిల్‌ 12 వరకు 10 వేదికల్లో జరిగే 20 మ్యాచ్‌ల తేదీలను మాత్రమే బీసీసీఐ బుధవారం ప్రకటించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే లీగ్‌ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో డిఫెండింగ్‌ చాంప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. కాగా, ఈ నెల 29న వాంఖడేలో మాజీ చాంపియన్లు ముంబై-కోల్‌కతా.. ఆ తర్వాతి రోజు గువాహటిలో రాజస్థాన్‌తో చెన్నై ఆడనున్నాయి. ఏప్రిల్‌ 4,5; 11,12 తేదీల్లో డబుల్‌ హెడర్‌లను షెడ్యూల్‌ చేశారు. తొలి అంచెలో పది జట్లు.. నాలుగేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. రాజస్థాన్‌ తమ తొలి మూడు మ్యాచ్‌లను అసోంలో ఆడిన తర్వాత నాలుగో మ్యాచ్‌ కోసం జైపూర్‌కు రానుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు రెండు హోంగ్రౌండ్‌లను ఎంపిక చేసుకొన్నాయి. బెంగళూరు రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో, పంజాబ్‌ కింగ్స్‌ మూడు మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడనున్నాయి.

ఆటగాళ్లు

ఎలా వస్తారు..?

కాగా, పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడే ప్లేయర్లు ఎలా వస్తారనేది అగమ్య గోచరంగా మారింది. టీ20 వరల్డ్‌క్‌పలో పాల్గొన్న వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా జట్లు విమాన సౌకర్యాలు లేకపోవడంతో స్వదేశం వెళ్లడం చాలా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వారి మళ్లీ లీగ్‌కు రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమాన చార్జీలు కూడా ఆకాశాన్నంటడం ఖాయమని చెబుతున్నారు. దీంతోపాటు వంట గ్యాస్‌ కొరత కారణంగా హోటళ్లను మూసేయాల్సిన పరిస్థితి లీగ్‌ నిర్వాహకులను కలవరపెడుతోంది. అయితే, తమ జట్టు ఆటగాళ్లు అకిల్‌ హొస్సేన్‌ (వెస్టిండీస్‌), డెవాల్డ్‌ బ్రేవిస్‌ (సౌతాఫ్రికా)లు లీగ్‌ ఆరంభానికి ముందే జట్టులో చేరతారని సీఎ్‌సకే సీఈవో కాశీ విశ్వనాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్

టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్

Updated Date - Mar 12 , 2026 | 05:43 AM