హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - May 17 , 2026 | 07:51 AM
హైదరాబాద్‌లోని బోలక్‌పూర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బోలక్‌పూర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
స్క్రాప్ సామగ్రి అధికంగా ఉండటంతో మంటలు మరింత ఎగసిపడుతున్నట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా?, ఎంత మేర ఆస్తినష్టం జరిగింది? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు, ఫైర్ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి ప్రకటన
Read Latest Telangana News And AP News And International News And Telugu News