శుభాంశు శుక్లాను యువత ఆదర్శంగా తీసుకోవాలి: సజ్జనార్
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:18 PM
భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లాను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్, జులై 13 (ఆంధ్రజ్యోతి): భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లాను దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) పిలుపునిచ్చారు. 41 ఏళ్ల విరామం తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఈరోజు (సోమవారం) హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కలామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శుభాంశు శుక్లా రచించిన ‘ద సెకండ్ ఆర్బిట్’ పుస్తకాన్ని సజ్జనార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడారు.

శుభాంశు శుక్లా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు..
Axiom-4 మిషన్‌లో పైలట్‌గా పాల్గొని శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారని సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. ఆయన రచించిన ‘ద సెకండ్ ఆర్బిట్’ పుస్తకంలో అంతరిక్ష యాత్రలో ఎదురైన అనుభవాలు, సవాళ్లను పొందుపరిచారని తెలిపారు. శుభాంశు శుక్లా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని సీపీ సజ్జనార్ ఆకాంక్షించారు.
యువత కోసం ఈ పుస్తకాన్ని రచించాను: శుభాంశు శుక్లా
అంతరిక్షం వరకు తన ప్రయాణం వెనుక ఉన్న అనుభవాలను దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు శుభాంశు శుక్లా తెలిపారు. హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, పట్టుదల అలవర్చుకుంటే ఎలాంటి లక్ష్యం అయినా సాధించవచ్చని సూచించారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు శుభాంశు శుక్లా సమాధానాలు ఇచ్చారు. అంతరిక్ష యాత్రకు సంబంధించిన తన అనుభవాలను వారితో పంచుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News