జిల్లా ఏర్పాటు అంటే సరిహద్దులు మార్చడం కాదు: హరీశ్ రావు
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:53 PM
సిద్ధిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన యువజన సదస్సు కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు, నందిని సిద్ధారెడ్డి పాల్గొన్నారు.
సిద్ధిపేట, అక్టోబర్ 9: ‘సిద్ధిపేట జిల్లా పదేళ్ల ఉత్సవాలు’ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిసున్న కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్ధిపేట చరిత్ర, తెలంగాణ చరిత్రను తెలుసుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలిపారు.
‘ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలకు ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం. ప్రొఫెసర్ జయశంకర్ వంటి వారు జీవిత కాలం తెలంగాణ కోసం తపించారు. నీకు పదవి కావాలా, తెలంగాణ కావాలా అని కేసీఆర్‌ను అడిగితే తెలంగాణ కావాలని కోరుకున్నారు కేసీఆర్. 2001లో కేసీఆర్ అన్ని పదవులు వదలి తెలంగాణ ఉద్యమ బాట పట్టారు. 2014లో ఆమరణ దీక్ష అనే చావు నోట్లో తల పెట్టి మరీ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. రాష్ట్రాన్ని సాధించి పక్కకు తప్పుకోలే. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించారు ఆయన. తెలంగాణ వచ్చిన నాడు 5 మెడికల్ కాలేజీలు ఉంటే, 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రంగా మారింది. తెలంగాణ ఏర్పడిన నాడు 2780 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే నేడు 10,000 సీట్లున్నాయి. ధాన్యం పంటలో, ఎంబీబీఎస్ సీట్లలో, డాక్టర్ల ఉత్పత్తిలో నేడు దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు బెంగాల్ ఈ రోజు ఏం చేస్తుందో, రేపు దేశం అది చేస్తుంది అనే నానుడి ఉండే. ఈ రోజు తెలంగాణ ఏది ఆచరిస్తుందో రేపు దేశం అది ఆచరిస్తుంది అనేలా రాష్ట్రాలన్ని అభివృద్ధి చేశారు.
పరిపాలన, అభివృద్ధి నేపథ్యంలో కేసీఆర్ జిల్లాలను విభజించారు. జిల్లా ఏర్పాటు అంటే.. బౌండరిస్ ఏర్పాటు కాదు. ప్రజలకు సత్వరసేవలు అందాలనే ఉద్ధేశ్యంతోనే జిల్లాలుగా విభజించాం. జిల్లా ఏర్పాటుతో లబ్ది పొందని కుటుంబమే లేదు. సిద్ధిపేట జిల్లా ఏర్పడక ముందు ఎలా ఉంది.. జిల్లా ఏర్పాటు తరువాత ఎలా ఉంది. రేపటి సిద్దిపేట ఎలా ఉండబోతోంది.. అనే దృక్పథంతో పనిచేయాలి’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారికి బంగారు పగడాల హారాల కానుక
Read Latest AP News And Telangana News