Share News

సింగరేణి కార్మికులకు మరో తీపి కబురు.. దీపావళి బోనస్ ప్రకటన

ABN , Publish Date - Oct 30 , 2026 | 04:46 PM

సింగరేణి కార్మికులకు యాజమాన్యం మరో తీపి కబురు చెప్పింది. దీపావళి బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

సింగరేణి కార్మికులకు మరో తీపి కబురు.. దీపావళి బోనస్ ప్రకటన
Singareni Workers

హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు యాజమాన్యం మరో తీపి కబురు చెప్పింది. దీపావళి బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 5వ తేదీన కార్మికుల ఖాతాల్లో బోనస్ జమ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కో కార్మికుడికి గరిష్ఠంగా రూ.1,10,250లు బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీపావళి బోనస్ కోసం రూ.419 కోట్లను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా సుమారు 38 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో ఈ బోనస్‌ను చెల్లిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. NCWA ఉద్యోగులకు మాత్రమే దీపావళి బోనస్‌ను వర్తింపజేస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది.


అధికారులకు ఈ బోనస్ వర్తించదని స్పష్టం చేసింది. కనీసం 30 రోజులు పనిచేసిన కార్మికులకు ఈ బోనస్‌ను అర్హతగా వర్తింపజేసింది. పని దినాల ఆధారంగానే బోనస్ లెక్కింపులు చేయనుంది. పూర్తి అర్హత ఉన్నవారికి గరిష్ఠ మొత్తం చెల్లించనుంది. దసరా, దీపావళి బోనస్‌లతో కార్మికులకు నెల రోజుల్లోనే భారీ నగదు ప్రయోజనం కలగనుంది. రెండు బోనస్‌ల రూపంలో ఒక్కో కార్మికుడికి సగటున రూ.2.65 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. రెండు బోనస్‌ల కోసం సింగరేణి నుంచి మొత్తం సుమారు రూ.1,020 కోట్ల చెల్లింపులు చేయనుంది. సింగరేణి కార్మికులకు పండుగ కానుకగా నెల రోజుల్లోనే రూ.2.65 లక్షల సగటు బోనస్‌ను సింగరేణి యాజమాన్యం ఇవ్వనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

కరవును చంద్రబాబు బాగా మేనేజ్‌ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు

ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 07:46 PM