Share News

హైదరాబాద్‌లో యువకుడిపై కత్తులతో దాడి

ABN , Publish Date - Oct 11 , 2026 | 08:51 AM

హైదరాబాద్‌ గోల్కొండలో దర్గా ఉరుసు వేడుకల సమయంలో గోల్కొండ శాంతికమిటీ సభ్యుడు మహ్మద్‌ రహీంపై ఇస్మాయిల్‌, తాహిర్‌ అనే అన్నదమ్ములు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్‌లో యువకుడిపై కత్తులతో దాడి
Hyderabad Golconda Knife Attack

హైదరాబాద్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ గోల్కొండలో దర్గా ఉరుసు వేడుకల సమయంలో గోల్కొండ శాంతికమిటీ సభ్యుడు మహ్మద్‌ రహీంపై ఇస్మాయిల్‌, తాహిర్‌ అనే అన్నదమ్ములు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గంజాయి మత్తులో మహ్మద్ రహీంపై ఈ దాడికి పాల్పడ్డారు. కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి, గొంతు కోసి వారు పరారయ్యారు.


తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో యువకుడు అక్కడే కుప్పకూలాడు. రహీంను హుటాహుటినా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఇస్మాయిల్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. మరో నిందితుడు తాహిర్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బేబీ రుక్సానాకు మెరుగైన వైద్యం, ఆమె తల్లికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి దామోదర

జగన్ అక్రమాస్తుల కేసుల్లో వేగం పెంచాలి.. తెలంగాణ హై కోర్టులో ఈడీ పిటిషన్

203 ఆస్పత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా: ఎన్టీఆర్ ట్రస్టు చర్యలు

Read Latest Telangana News And AP NewsAnd National News

And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 09:37 AM