గణేశ్ నిమజ్జనం రోజున 8 స్పెషల్ ఎంఎంటీఎస్‌లు
ABN , Publish Date - Sep 23 , 2026 | 06:54 AM
గణేశ్ విగ్రహాల నిమజ్జనం రోజు 25వ తేదీన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: గణేశ్ విగ్రహాల నిమజ్జనం రోజు 25వ తేదీన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 25న రాత్రి 11 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ తెలిపారు. రాత్రి 11.10 గంటలకు హైదరాబాద్ (నాంపల్లి) నుంచి లింగంపల్లికి, 11.50 గంటలకు సికింద్రాబాద్ - హైదరాబాద్ (నాంపల్లి), 12.10 గంటలకు లింగంపల్లి - ఫలక్‌నుమా, 12.30గంటలకు హైదరాబాద్ - లింగంపల్లి,
1.50 గంటలకు లింగంపల్లి - హైదరాబాద్, 2.20గంటలకు ఫలక్‌నుమా - సికింద్రాబాద్, 3.30 గంటలకు హైదరాబాద్ - సికింద్రాబాద్, 4గంటలకు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఎంఎంటీఎస్ స్టేషన్లలోనూ ఆగుతాయని శ్రీధర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గణేశ నిమజ్జనం వేళ.. బార్లు, వైన్ షాప్‌ల బంద్
Read Latest AP News And Telangana News And International News And Telugu News