Share News

యువ వికాసంపై చిగురిస్తున్న ఆశలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:34 AM

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకానికి శ్రీకారం చుట్టింది.

యువ వికాసంపై చిగురిస్తున్న ఆశలు
Rajiv Yuva Vikasam

  • జిల్లాలో 30,022మంది దరఖాస్తులు

  • మంజూరైన యూనిట్లు 8,879

  • నవంబరు 19 నుంచి సాయం

  • నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు

బెజ్జూరు(కుమరం భీం): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా వారికి ఆర్థిక సాయం అందించాలనేది దీని ఉద్దేశం. ఇందులో భాగంగా గత ఏడాది మార్చి 14వ తేదీ వరకు ‘మీసేవా’ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత నుంచి తదుపరి ప్రక్రియలో కదలిక కనిపించలేదు. జిల్లాకు 8,879 యూనిట్లు మంజూరు చేయాలనేది లక్ష్యం కాగా, జిల్లాలో 30,022 దరఖాస్తులొచ్చాయి. విచారణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.


  • తొలి విడతగా..

యువ వికాసం పథకం తొలి విడతగా నవంబరు 19 నుంచి లబ్ధి దారులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నట్లు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమా ర్క తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని యువతలో ఆశలు చిగురింప జేస్తున్నాయి. వాస్తవా నికి గత ఏడాది జూన్‌ 2వ తేదీనే యూనిట్ల రుణ పత్రాలు అందిస్తారని భావించగా, అప్పట్లో దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. అప్పటి నుంచి మంజూరు ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది.


అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధి దారులను ఎంపిక చేస్తారా? లేక మళ్లీ కొత్త దరఖాస్తులు స్వీకరిస్తారా? అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అధికార వర్గాల సమాచారం మేరకు గతంలో దరఖాస్తులు చేసుకున్న వారికే ప్రాదాన్యత ఉంటుందని ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. లబ్ధి దారుల ఎంపిక బాద్యత కలెక్టర్‌దే.


గతంలో చేసిన దరఖాస్తులను పరిశీలిస్తారా అనేదానిపై పూర్తి స్థాయిలో స్పష్టత లేక నిరుద్యోగ యువతలో గందరగోళం నెలకొంది. మండల, మున్సిపల్‌, జిల్లాస్థాయి కమిటీల పరిశీలన ద్వారా తుది జాబితా కలెక్టర్‌కు అందజే స్తారని సమాచారం. ఈ సారి మాత్రం యువ వికాసం లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నట్లు తెలు స్తోంది. నవంబరు తొలి వారంలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.


adb1.2.jpg

  • ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం..

రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తొలి నుంచి ఈ పథకం అమలుపై ఊరిస్తూ రావడంతో దరఖా స్తుదారుల్లో ఆందోళన నెలకొనగా, ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పథకం అమలుపై స్పష్టత ఇవ్వడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురింపజేస్తున్నాయి.


నవంబరు 19నుంచి తొలి విడతలో ఎంపిక చేసిన యువతకు సాయం అంది స్తామని ప్రకటించడంతో పథకం అమలులో కదలిక వచ్చినట్టేనని తెలుస్తోంది. 2025 జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకల సందర్బంగా ముందుగా రూ.50వేల సాయం అందిం చాలని లక్ష్యం పెట్టుకోగా, పలు కారణాల దృష్ట్యా అమలు కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రుణాలు ఇచ్చేం దుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో పథకం అమలుపై ఆశలు రేపుతున్నాయి.


zz.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

శుక్రవారం మధ్యాహ్నం లోపే ఖైరతాబాద్‌ గణపయ్య నిమజ్జనం

మళ్లీ తగ్గిన బంగారం ధరలు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 11:39 AM