Share News

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత.. కారణమిదే

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:06 AM

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును వారం రోజుల పాటు మూసివేయనున్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఘాట్ రోడ్‌కు మరమ్మతు పనులు చేపట్టారు.

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత.. కారణమిదే
Indrakeeladri Ghat Road

విజయవాడ, సెప్టెంబర్ 22: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును వారం రోజుల పాటు మూసివేయనున్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఘాట్ రోడ్‌కు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 22న ఉదయం నుంచి ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేస్తున్నట్లు దుర్గుగడి ఈఓ వి.కె. శీనా నాయక్ తెలిపారు. వారం రోజుల పాటు ఘాట్ రోడ్‌లో వాహనాల రాకపోకలకు అనుమతి లేదని, భక్తులు శ్రీ కనకదుర్గానగర్ మార్గం ద్వారా ఆలయానికి చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులకు పున్నమి ఘాట్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు.


పున్నమి ఘాట్ నుంచి ఆలయానికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని ఈవో అన్నారు. విశాఖ, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వన్‌టౌన్ వైపు వచ్చే భక్తులకు సీతమ్మ వారి పాదాల వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే సీతమ్మ వారి పాదాల నుంచి ఆలయానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని చెప్పారు. పార్కింగ్ ప్రాంతాల నుంచి దేవస్థానానికి ఉచిత రవాణా ఏర్పాటు చేశామని, భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఈవో శీనా నాయక్ సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి...

విశాఖపట్నంలో గన్ కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్

వాయుగుండంతో సర్కార్ అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 11:06 AM