వాయుగుండంతో సర్కార్ అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 09:51 AM
వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేడు, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
విశాఖపట్నం, సెప్టెంబర్ 22: వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నేడు, రేపు శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు.
అంతేకాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు కంట్రోల్ రూంలు అందుబాటులో ఉంచాలన్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. చెట్లు, భారీ హోర్డింగ్స్, శిథిలావస్థలో ఉన్న ఇళ్ల వద్ద ప్రజలు ఉండరాదని సూచించారు. ప్రభుత్వం జారీ చేసే వాతావరణ హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోం మంత్రి అనిత సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి...
విశాఖపట్నంలో గన్ కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్
Read Latest AP News And Telugu News