Share News

విశాఖపట్నంలో గన్ కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్

ABN , Publish Date - Sep 22 , 2026 | 09:32 AM

విశాఖపట్నంలో యువకుల వద్ద గన్ లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గొల్లలపాలెంలోని ఓ ఇంట్లో యువకుల వద్ద గన్ ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది.

విశాఖపట్నంలో గన్ కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్
Visakhapatnam gun seized

విశాఖపట్నం, సెప్టెంబర్ 22: నగరంలో యువకుల వద్ద గన్ లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. గొల్లలపాలెంలోని ఓ ఇంట్లో యువకుల వద్ద గన్ ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువకుల ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో యువకుల వద్ద ఉన్న గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టూటౌన్‌ పోలీసులు యువకులను విచారించారు.


విచారణలో భాగంగా గన్‌ను బిహార్ నుంచి కొనుగోలు చేసినట్లు యువకుల నుంచి సమాచారాన్ని రాబట్టారు. అయితే గన్‌ను ఎందుకు కొనుగోలు చేశారు.. ఎవరి నుంచి గన్‌ను తీసుకున్నారనే కోణంలో టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉంటున్న యువకుల వద్ద గన్ లభించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.


ఇవి కూడా చదవండి...

ట్రంప్‌పై అమెరికా టీవీచానళ్ల నిషేధం

పాలిటెక్నిక్‌ యథాతథం!

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 09:38 AM