Share News

ట్రంప్‌పై అమెరికా టీవీచానళ్ల నిషేధం

ABN , Publish Date - Sep 22 , 2026 | 04:34 AM

అమెరికాలోని ప్రముఖ టీవీ చానళ్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి షాకిచ్చాయి. ఇకపై ఆయన అధికారిక కార్యక్రమాలు, పర్యటనలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకూడదని సోమవారం నిర్ణయించాయి.

ట్రంప్‌పై అమెరికా   టీవీచానళ్ల నిషేధం
Trump

వాషింగ్టన్‌, సెప్టెంబరు 21: అమెరికాలోని ప్రముఖ టీవీ చానళ్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి షాకిచ్చాయి. ఇకపై ఆయన అధికారిక కార్యక్రమాలు, పర్యటనలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకూడదని సోమవారం నిర్ణయించాయి. అధ్యక్ష భవనం కార్యకలాపాలను కవర్‌చేస్తూ తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయంటూ సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నవ్‌, పొలిటికో సంస్థలపై ట్రంప్‌ ఇటీవల నిషేధం విధించారు. అందుకు నిరసనగా టెలివిజన్‌ పూల్‌ కన్సార్టియం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పూల్‌లో ఏబీసీ, సీబీఎస్‌, సీఎన్‌ఎన్‌, ఫాక్స్‌న్యూస్‌, ఎన్‌బీసీ తదితర పెద్ద వార్తా సంస్థలు ఉన్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో ట్రంప్‌ పాల్గొనే కార్యక్రమానికి కూడా కవరేజీ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు ఈ కన్సార్టియంకు తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్న ఫాక్స్‌న్యూస్‌ జర్నలిస్టు బ్రయాన్‌ బాటన్‌ తెలిపారు. తమపై నిషేధం విధించటాన్ని సవాల్‌ చేస్తూ సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌ నౌ, పొలిటికో సంస్థలు ట్రంప్‌ ప్రభుత్వంపై సోమవారం కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశాయి.

Updated Date - Sep 22 , 2026 | 04:34 AM