Share News

గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో డ్యాన్స్.. విశాఖ టీమ్‌పై చర్యలు

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:41 AM

హైదరాబాద్‌లో జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో విశాఖకు చెందిన డ్యాన్స్ హంగామా చేయడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆ డ్యాన్స్‌ బృందాన్ని ట్రాక్‌ చేసి.. ఇండియన్ రాక్ పైథాన్‌ను రక్షించారు.

గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో డ్యాన్స్.. విశాఖ టీమ్‌పై చర్యలు
Vizag dance team

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నగరంలో జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో విశాఖకు చెందిన డ్యాన్స్ హంగామా చేయడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఆ డ్యాన్స్‌ బృందాన్ని ట్రాక్‌ చేసి.. ఇండియన్ రాక్ పైథాన్‌ను రక్షించారు. విశాఖకు చెందిన ఓ డ్యాన్స్ గ్రూప్.. హైదరాబాద్‌ నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసింది. అయితే తమ ప్రదర్శనలో ప్రత్యేకత కోసం ఓ యువతి ఏకంగా కొండచిలువతో డ్యాన్స్ చేసింది. తన మెడలో పెద్ద కొండచిలువను వేసుకొని స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.


అయితే, ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు అనిమల్స్ (GHSPCA) బృందం రంగంలోకి దిగింది. డ్యాన్స్‌ టీమ్‌ను గుర్తించేందుకు సుమారు ఐదు రోజుల పాటు వారిని ట్రాక్ చేసింది. ఎట్టకేలకు మధురానగర్ పోలీసుల సహాయంతో విశాఖ డ్యాన్స్‌ బృందాన్ని పట్టుకుంది. వారి వద్ద నుంచి కొండ చిలువను పోలీసులు, GHSPCA బృందం స్వాధీనం చేసుకుంది. కొండచిలువను మెడలో వేసుకుని డ్యాన్స్ చేయడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

విశాఖపట్నంలో గన్ కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్

వాయుగుండంతో సర్కార్ అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 10:50 AM