గ్యాస్ సిలిండర్ల కొరత లేదు, పుకార్లు నమ్మొద్దు: కేంద్ర మంత్రి పూరి
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:15 AM
ఎల్పీజీ, వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని, కొరత ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలు, వదంతులను పట్టించుకోకూడదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. వినియోగదారుల డిమాండ్లకు తగ్గట్లు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని ఓ వార్తా సంస్థకు ఆయన తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకోవడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఎల్పీజీ, వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని, కొరత ఉన్నట్లు వస్తున్న ఊహాగానాలు, వదంతులను పట్టించుకోకూడదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. వినియోగదారుల డిమాండ్లకు తగ్గట్లు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచామని ఓ వార్తా సంస్థకు ఆయన తెలిపారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకోవడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ‘హోర్ముజ్ ఇష్యూ కొంత ప్రభావం చూపిన మాట వాస్తవమే. అయితే, వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే గ్యాస్ ఉత్పత్తిని (డొమెస్టిక్ ప్రొడక్షన్) పెంచాం. ఇంతకుముందు ఆ ఉత్పత్తి 34 వేల టన్నులు ఉండగా.. ఇప్పుడు 55 వేల నుంచి 56 వేల టన్నులకు పెంచాం. ఎక్కడా ఎల్పీజీ కొరత లేదు. వదంతులు నమ్మి గ్యాస్ సిలిండర్ల కోసం పొడవైన క్యూలైన్లలో నిల్చోవద్దు’ అని మంత్రి పేర్కొన్నారు.
డిజిటల్ బుకింగ్ వాడండి..
వంటగ్యాస్ కోసం డిజిటల్ బుకింగ్ వాడాలని వినియోగదారులకు మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచించారు. అనవసరంగా గోదాంలకు వెళ్లి గ్యాస్ తెచ్చుకోవద్దన్నారు. ‘యాప్ వాడుతూ మీ ఫోన్‌లోనే వంటగ్యాస్‌ను బుక్ చేసుకోండి. 24 గంటల్లోనే మీ ఇంటికి సిలిండర్ వస్తుంది. గ్యాస్ సిలిండర్ల కొరత లేదు. కానీ, కొరత ఉన్నట్లు వస్తున్న వదంతులకు మాత్రం కొదువ లేదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. వదంతుల కారణంగా చాలా మంది భయపడి అనవసరంగా ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకునే ప్రయత్నం చేశారని, దీంతో కొన్ని ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. గురుగ్రాంలోని తన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు వదంతులకు భయపడి ఎక్స్‌ట్రా సిలిండర్లను బుక్ చేసుకున్నారని గుర్తుచేశారు. ఆయనకు గ్యాస్ పైప్ లైన్ ఉన్నా వదంతులకు ఆయన భయపడ్డారని చెప్పారు. సాధారణంగా రోజుకు సగటున 52 లక్షల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు జరుగుతాయని, కానీ వదంతుల కారణంగా కొన్ని రోజుల పాటు బుకింగ్‌ల సంఖ్య రోజుకు 90 లక్షలకు పెరిగిందని గుర్తుచేశారు. ప్యానిక్ బుకింగ్‌లను కట్టడి చేయడానికి పంపిణీ వ్యవస్థను రేషనలైజ్ చేశామని వివరించారు.
Also Read:
గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో డ్యాన్స్.. విశాఖ టీమ్‌పై చర్యలు
తుఫాన్ అలర్ట్.. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు సెలవులు
అమెరికా మరో అస్త్రం.. ఇరాన్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు..