Share News

అమెరికా మరో అస్త్రం.. ఇరాన్‌ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు..

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:03 AM

ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే దిశగా అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఇరాన్‌పై అమెరికా మరొక అస్త్రం ప్రయోగించబోతోంది.

అమెరికా మరో అస్త్రం.. ఇరాన్‌ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు..
Donald Trump Iran war

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే దిశగా అమెరికా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఇరాన్‌పై అమెరికా మరొక అస్త్రం ప్రయోగించబోతోంది. ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థలను అంతర్జాతీయంగా పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. సెప్టెంబర్ 23 నుంచి ఇరాన్ విమానాలకు సేవలు అందించే విదేశీ సంస్థలపైనా కఠినమైన ఆంక్షలు విధిస్తామని ఆయన హెచ్చరించారు (Trump Iranian airlines).


సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 23 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన విమానయాన సంస్థలు పనిచేయకుండా చేస్తామని అన్నారు. ఇరాన్ విమానం ఏదైనా విదేశీ విమానాశ్రయంలో దిగితే.. దానికి ఇంధనం అందించడం, ల్యాండింగ్ సేవలు కల్పించడం, టికెట్లు విక్రయించడం వంటి సేవలు అందించే సంస్థలపైనా అమెరికా చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలోని డాలర్ వ్యవస్థ నుంచి ఆయా సంస్థలను తొలగించే అవకాశం ఉందని బెసెంట్ స్పష్టం చేశారు (Iran airlines shutdown).


అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ విమానయాన రంగం ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది (US sanctions Iran). విమానాలు, విడిభాగాలు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ సేవలు పొందడంలో ఇరాన్ విమానయాన సంస్థలు అనేక ఆంక్షలు ఎదుర్కొంటోంది. ఇరాన్‌కు చెందిన మొత్తం 27 ఇరాన్ విమానయాన సంస్థలను ఇప్పటికే లక్ష్యంగా చేసుకుని అమెరికా ఆంక్షలు విధించింది.


ఇవి కూడా చదవండి..

ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..


మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 22 , 2026 | 10:03 AM