Share News

రాజీమార్గమే రాజమార్గం..

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:39 PM

రాజీమార్గమే రాజమార్గ మని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ సంస్థ అధికారి వీరయ్య అన్నారు. మంచి ర్యాలలోని న్యాయస్ధానంలో శనివారం జాతీ య లోక్‌ అదాలత కార్యక్రమాన్ని నిర్వహిం చారు.

రాజీమార్గమే రాజమార్గం..
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య

- జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య

మంచిర్యాలక్రైం, సెప్టెంబరు 12 (ఆంధ్ర జ్యోతి):రాజీమార్గమే రాజమార్గ మని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ సంస్థ అధికారి వీరయ్య అన్నారు. మంచి ర్యాలలోని న్యాయస్ధానంలో శనివారం జాతీ య లోక్‌ అదాలత కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మొత్తం 3500లకు పైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. రాజీమార్గంలో ఇరువర్గాల వారు వారి కేసుల నుంచి వి ముక్తి పొందాలన్నారు. జిల్లాలో మొత్తం తొమ్మిది లోక్‌ అదాలత బెంచీలను ఏర్పా టు చేశామని, కక్షిదారుల సమయం వృధా కాకుండా అప్పిల్లేకుండా ఇరు వర్గాల వారు గెలిచినట్లుగా అంతిమ తీర్పుగా ఉంటుందన్నారు. ఇందులో సివిల్‌ దావాలు 32, క్రిమినల్‌ కేసులు 3300, సైబర్‌ క్రైమ్‌ 2లో రూ. 17000, బ్యాంక్‌ ప్రిలిటి గేషన కేసులు 16 రూ. 984000, ఇతర కేసుల్లో మొ త్తం కలిపి 3500 కేసులను పరిష్కరించా మని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ సంస్థ కార్యదర్శి కవిత, నిర్మల, సివిల్‌ జడ్జి రామ్మో హన రెడ్డి,బార్‌ అసోసియేషన అధ్యక్షుడు కొత్త సత్తయ్య, పోలీసులు, పాల్గొన్నారు.

చెన్నూరు: చెన్నూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జూనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి ఆధ్వర్యంలో జాతీయ లోక్‌ అదాలత కార్యక్రమం నిర్వహించారు. ఇం దులో వివిధ రకాల 912 కేసు లకు సంబంధించి కక్షి దారులు రాజీపడినట్లు జడ్జి పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు కొలిపాక రవీందర్‌, మద్ది కార్తీక్‌, కుమార్‌, రమాదేవి, జుబేర్‌, అడ్వేకేట్‌లు, పోలీసులు పాల్గొన్నారు.

లక్షెట్టిపేట: రాజీమార్గమే రాజ మార్గం అని లక్షెట్టిపేట జూని యర్‌ సివిల్‌ జడ్జ్‌(ఇనచార్జి) బి కృష్ణతేజ అన్నారు. పట్టణ న్యాయస్థానంలో శనివారం న్యాయ సేవాదికార సంస్థ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌ అదా లతలో జడ్జ్‌ ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. లక్షెట్టిపేట, జన్నారం, దండేపల్లి, హాజీపూర్‌ మండ లాల్లోని పోలీస్‌ స్టేషన్లలో నమోదైన సుమారు 486 కేసులు క్షక్షిదారులు రాజీపడటంతో వాటిని పరిష్కరించారు. కార్యక్ర మంలో లక్షెట్టిపేట సీఐ రమణ మూర్తి, ఎస్సైలు గోపతి సురేష్‌, రాజవర్థన, ఉదయ్‌ కిరన, బార్‌ అసోసియేషన అద్యక్షుడు గోవింద్‌రావు, న్యాయ వాదులు రాజే శ్వర్‌రావు, భూంరెడ్డి, అక్కల శ్రీధర్‌, కారుకూరి సురేందర్‌, నలినీ కాంత, పద్మ, కిరణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 11:39 PM