త్వరలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 06:11 AM
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే అర్హులైనవారి దరఖాస్తులను పరిశీలించి పారిశ్రామిక రాయితీలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్ హామీ ఇచ్చారు.
అమరావతి, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే అర్హులైనవారి దరఖాస్తులను పరిశీలించి పారిశ్రామిక రాయితీలను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభం బన్సల్ హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సంఘం నాయకుడు పినమాల నాగకుమార్ నేతృత్వంలో మంగళవారం పలువురు దళిత పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక డైరెక్టర్‌ను కలిశారు. తక్కువ వడ్డీకి రుణాలు అందించడంతోపాటు విద్యుత్తు సబ్సిడీ, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి...
పాదగయలో విషాదం.. పుష్కరిణిలో స్నానానికి దిగి యువకుడి గల్లంతు..
సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం