Share News

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:28 PM

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మంగళవారం మేదరమెట్లలో జరిగిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, కలెక్టర్‌ రాజాబాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
దివ్యాంగులకు స్కూటర్‌లు అందజేస్తున్న మంత్రి, కలెక్టర్‌

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

మేదరమెట్ల, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి) : సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మంగళవారం మేదరమెట్లలో జరిగిన మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, కలెక్టర్‌ రాజాబాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 33 మంది దివ్యాంగులకు స్కూటర్‌లను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుక్ను 119 మందికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యార్థులకు ఇప్పటివరకు 11,800 సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది 6వ తరగతిలో చేరిన విద్యార్థులకు 200 సైకిళ్లు పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు. దివ్యాంగులకు 200 స్కూటర్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 3,821 మంది పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.32 కోట్లు పంపిణీ చేశామన్నారు. నియోజకవర్గంలో వివిధ రహదారుల అభివృద్ధికి రూ.100 కోట్లతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈఎ్‌సఆర్‌ నిధులతో 23 కమ్యూనిటీ హాల్‌లు, ఎంపీ నిధులతో 2 కమ్యూనిటీ హాల్‌లు నిర్మించామన్నారు. ఇంకా 7 కమ్మూనిటీ హాల్‌లు నిర్మాణం చేయనున్నట్టు చెప్పారు. దాతలు, సీఎ్‌సఆర్‌ నిధులతో 60 కమ్యూనిటి హాల్‌ లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం చేయకుండానే చేశామని చెప్పి మోసం చేశారని మంత్రి రవికుమార్‌ ధ్వజమెత్తారు. పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి విడతలవారీగా మంజూరవుతాయన్నారు. మేదరమెట్ల-రావినూతల రోడ్డుకు త్వరలో నిఽధులు మంజూరు చేయిస్తామన్నారు. పోటీ పరీక్షలలో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారిపై దాడి చేయడం, వారిని అవమానించడం రెచ్చగొట్టేలా మాట్లాడాన్ని ఆయన ఖండించారు. జగన్‌ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా 16 వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మేదరమెట్లలో రెండు షటిల్‌ కోర్టులు నిర్మిస్తామని, అద్దంకిలో ఇప్పటికే ఒకటి నిర్మాణంలో ఉందని తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వివిధ సమస్యలపై అర్జీలతో వచ్చిన వారి కోసం మంత్రి రవికుమార్‌, కలెక్టర్‌ రాజాబాబులు చివరి అర్జీదారుని వరకు ఓపికగా సమస్యలు విని సమాధానం చెప్పారు. పమిడిపాడులో పొలాలకు రోడ్లుకు సంబంధించిన వచ్చిన రైతులతో మంత్రి వివరంగా మాట్లాడి తహసీల్దార్‌కు సమస్యను పరిశీలించి పరిష్కారించాలన్నారు. ఈసందర్భంగా మొత్తం 200కు పైగా అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయజ్యోతి కుమారి, అన్ని శాఖల జిల్లా అధికారులు, కొరిశపాడు తహసీల్దార్‌ జీవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:28 PM