వైభవ్ ఆడితే చూడాలనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:28 PM
జపాన్‌తో జరిగిన చారిత్రక మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కని సంగతి తెలిసిందే. ఇదే విషయంపై జపాన్ కెప్టెన్ కెండేల్ ఫ్లెమింగ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌తో జరిగిన చారిత్రక మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కని సంగతి తెలిసిందే. ఇదే విషయంపై జపాన్ కెప్టెన్ కెండేల్ ఫ్లెమింగ్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం వైభవ్‌ను ఆడించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 15 ఏళ్ల యువ ప్లేయర్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం నిరాశ కలిగించిందని తెలిపాడు.
జపాన్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు నుంచే వైభవ్ సూర్యవంశీపై జపాన్ కెప్టెన్ ఆసక్తి చూపించాడు. భారత జట్టులో ఈ 15 ఏళ్ల యువ సంచలనం ఉండటం గురించి ప్రస్తావించాడు. అయితే తీరా మ్యాచ్ సమయానికి తుది జట్టులో వైభవ్ లేకపోవడంతో కెండేల్ నిరాశకు గురయ్యాడు. ‘యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడితే చూడాలని చాలా ఆసక్తిగా ఎదురుచూశా. కానీ అతడు జట్టులో లేకపోవడం నిరాశ కలిగించింది’ అని మ్యాచ్ అనంతరం జపాన్ కెప్టెన్ కెండేల్ పేర్కొన్నాడు.
ఓడినా.. బెస్ట్ టీమ్‌ను వణికించాం..
వర్షం కారణంగా ఆటను 5 ఓవర్లకు కుదించారు. కాగా భారత్ 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసి 33 పరుగుల లక్ష్యాన్ని జపాన్‌కు నిర్దేశించింది. ఆతిథ్య దేశం గట్టిగా పోరాడింది. కేవలం 2 పరుగుల తేడాతో ఓడింది. దీనిపై జపాన్ కెప్టెన్ కెండేల్ స్పందించాడు. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అయిన టీమిండియాను ఆఖరి బంతి వరకు నిలువరించి పోరాడాం. మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. ఓడిపోవడం కాస్త బాధ కలిగించినా.. భారత్ లాంటి జట్టుపై అత్యుత్తమ ప్రదర్శన చేయడం కలలా అనిపిస్తోంది’ అని వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణం.. భారత మహిళా జట్టుకు మోదీ అభినందనలు
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు