అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ వీడ్కోలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:29 PM
ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల వుడ్.. కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. మోకాలు, చీలమండ గాయాలు అతడి కెరీర్‌కు తీవ్ర ఆటంకాలు కలిగించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల వుడ్.. కొంతకాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. మోకాలు, చీలమండ గాయాలు అతడి కెరీర్‌కు తీవ్ర ఆటంకాలు కలిగించాయి. అయినప్పటికీ ప్రతిసారీ పుంజుకుని జట్టులోకి వచ్చిన వుడ్.. చివరకు గాయాలతో చేసిన పోరాటంలో ఓడిపోయానంటూ భావోద్వేగ ప్రకటన చేశాడు.
గాయాల కారణంగా 15 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న వుడ్.. ఎల్బో సర్జరీ, ఆ తర్వాత మోకాలి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇటీవల పెర్త్‌లో జరిగిన తొలి యాషెస్ టెస్టులో తిరిగి బరిలోకి దిగాడు. అయితే కేవలం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన తర్వాత ఎడమ మోకాలిలో వాపు రావడంతో మరోసారి మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తరఫున మళ్లీ ఆడలేకపోయాడు. వైద్యుల సూచనల మేరకు ఇక సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్ ఆడటం సాధ్యం కాదని వుడ్ వెల్లడించాడు.
‘గతేడాది కాలంగా ఇంగ్లండ్ తరఫున ఆడాలనే నా కల నెమ్మదిగా దూరమవుతూ వస్తోంది. గాయం నుంచి కోలుకుని మళ్లీ వచ్చి విమర్శకులకు సమాధానం ఇవ్వాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నా. కానీ ఈసారి ఆ పోరాటంలో ఓడిపోయాను. ఇంగ్లండ్ తరఫున ఆడటం నేను కోరుకోగలిగిన గొప్ప గౌరవం. అదే నా కల నెరవేరిన క్షణం’ అని వుడ్ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇవి కూడా చదవండి:
స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్‌గా..
జపాన్‌తో చారిత్రక టీ20లో టీమిండియాదే విజయం