స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి మహిళా క్రికెటర్‌గా..
ABN , Publish Date - Sep 22 , 2026 | 02:48 PM
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన ఘనత సాధించింది. ఆసియా క్రీడల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో స్మృతి(79) హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించింది.
శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు స్మృతి ఖాతాలో 10,987 అంతర్జాతీయ పరుగులు ఉన్నాయి. ఇందులో టెస్టుల్లో 788, వన్డేల్లో 5,411, టీ20ల్లో 4,788 పరుగులు ఉన్నాయి. 11 వేల పరుగుల మైలురాయిని అందుకోవాలంటే ఆమెకు కేవలం 13 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడిన స్మృతి.. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదింది. మూడో ఓవర్లో సిక్స్ కొట్టి 11 వేల పరుగుల మైలురాయిని అందుకుంది. ఇటీవలే మహిళల క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా మంధాన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పురుషులు, మహిళల విభాగాలను కలిపి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ స్మృతి చరిత్ర సృష్టించింది.
ఇదిలా ఉంటే, శ్రీలంకపై భారత్ 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆసియా క్రీడలు 2026లో క్రికెట్‌లోనే భారత్‌కు తొలి స్వర్ణం రావడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. పసిడిని నిలబెట్టుకుంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్