జపాన్‌తో చారిత్రక టీ20లో టీమిండియాదే విజయం
ABN , Publish Date - Sep 22 , 2026 | 02:16 PM
ఆతిథ్య దేశం జపాన్‌తో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటను 5 ఓవర్లకే కుదించారు. ఇందులో టీమిండియా 2 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలకు ముందు భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఆతిథ్య దేశం జపాన్‌తో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఆటను 5 ఓవర్లకే కుదించారు. ఇందులో టీమిండియా 2 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(0) నిరాశపర్చాడు. సంజు శాంసన్(9), ఇషాన్ కిషన్(3), శ్రేయస్ అయ్యర్(16) పరుగులు చేశారు. తిలక్ వర్మ(1*), శివమ్ దూబె(0*) నాటౌట్‌గా నిలిచారు. జపాన్ బౌలర్లలో చార్లీ హర హింజే 2, ఇబ్రహీం, బెంజమిన్ తలొక వికెట్ పడగొట్టారు. ఛేదనలో జపాన్ గట్టి పోటీనిచ్చింది. 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. కెప్టెన్ కేండేల్ ఫ్లెమింగ్(12), బెంజమిన్(9) రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్