ఐపీఎల్: సీఎస్కే కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:51 PM
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్కే తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్కే తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించింది. ఇటీవలే హెడ్ కోచ్ పదవికి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
జహీర్ ఖాన్‌కు హెడ్ కోచ్‌గా ఇదే తొలి బాధ్యత కావడం విశేషం. గతంలో ఆయన ముంబై ఇండియన్స్ జట్టుకు 2018 నుంచి 2022 వరకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2024 ఆగస్టు నుంచి 2025 సెప్టెంబర్ వరకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. 2017లో అనిల్ కుంబ్లే భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో జహీర్‌ను తొలుత టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. అయితే అదే ఏడాది రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో జహీర్ పాత్రలో మార్పు చేశారు. బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఆయన సేవలు అందించాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్