Share News

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:23 PM

ఆసియా క్రీడల్లో భారత స్విమ్మింగ్ బృందానికి మరోసారి నిరాశ ఎదురైంది. నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ పాల్గొన్న పురుషుల 4x200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!
R Madhavan

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత స్విమ్మింగ్ బృందానికి మరోసారి నిరాశ ఎదురైంది. నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ పాల్గొన్న పురుషుల 4x200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. కేవలం 0.2 సెకన్ల తేడాతో ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది. దీంతో వేదాంత్ తన నిరాశను సోషల్ మీడియాలో పంచుకోగా.. తండ్రి మాధవన్ స్పందించాడు.


సాజన్ ప్రకాశ్, దక్షన్ శశికుమార్, అనీష్ సునీల్‌తో కలిసి వేదాంత్ భారత రిలే జట్టులో బరిలోకి దిగాడు. సోమవారం జరిగిన క్వాలిఫికేషన్‌లో భారత జట్టు 7:24.32 సెకన్లలో రేసును పూర్తి చేసి 13 జట్లలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. టాప్-8 జట్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఎనిమిదో స్థానంలో నిలిచిన ఖతార్ 7:24.10 టైమింగ్ నమోదు చేసింది. దీంతో భారత్ కేవలం 0.22 సెకన్ల తేడాతో ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. దీంతో వేదాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన నిరాశను వ్యక్తం చేశాడు. ‘0.2 సెకన్ల తేడాతో ఫైనల్ మిస్ అయ్యాం. భారత జట్టులో అత్యుత్తమ టైమింగ్‌కు 0.5 సెకన్ల దూరంలో ఉన్నాను’ అంటూ వేదాంత్ పోస్టు చేశాడు.


ఈ స్టోరీని మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. గ్రాటిట్యూడ్ ఎమోజీని జత చేశాడు. కొడుకు ప్రదర్శనపై గర్వంగా ఉన్నాననే భావాన్ని ఆయన తన స్పందన ద్వారా తెలియజేశాడు. వేదాంత్‌కు ఇంకా రెండు వ్యక్తిగత ఈవెంట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 23న 200 మీటర్ల ఫ్రీస్టైల్, సెప్టెంబర్ 25న 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో అతడు పోటీపడనున్నాడు.

R-Madhavan.jpg


ఇవి కూడా చదవండి:

ఆఫీస్‌లో సెక్యూరిటీ భయ్యానే నా తొలి స్నేహితుడు.. యువతి వీడియో వైరల్

ఆసియా క్రీడలు: సెమీస్ డ్రా.. సుచిక ఫైనల్‌కు వెళ్లకపోవడం వెనుక వింత రూల్!

Updated Date - Sep 21 , 2026 | 05:27 PM