జురెల్ వికెట్ కీపర్ మాత్రమే కాదు.. కాఫీ మేకర్ కూడా
ABN , Publish Date - Sep 22 , 2026 | 11:44 AM
చాలా మందికి కాఫీ అంటే మహా ఇష్టం. కాఫీ లేనిదే అలాంటి వారికి రోజు గడవదు. ఉదయం నిద్ర లేస్తేనే కాఫీ తాగి రోజు మొదలుపెడతారు. అలాగే, కాఫీ రుచిని ఆస్వాదించడంతో పాటు కాఫీ తయారు చేయడంలోనూ వారు ఆసక్తి చూపుతారు. మన ఇండియన్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా అలాంటి కోవకు చెందినవాడే. అతను కాఫీ ప్రియుడు. కాఫీ ఎంతో ఇష్టంగా తాగే అతను తరచూ కాఫీ చేస్తాడు కూడా.
ఇంటర్‌నెట్ డెస్క్: చాలా మందికి కాఫీ అంటే ఇష్టం. కాఫీ లేనిదే రోజు గడవదు. ఉదయం నిద్ర లేస్తేనే కాఫీ తాగి రోజు మొదలుపెడతారు. అలాగే, కాఫీ రుచిని ఆస్వాదించడంతో పాటు కాఫీ తయారు చేయడంలోనూ కొంతమంది ఆసక్తి చూపుతారు. మన ఇండియన్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా కాఫీ ప్రియుడు. కాఫీ ఎంతో ఇష్టంగా సిప్ చేసే అతను తరచూ కాఫీ చేస్తాడు కూడా. కాఫీ చేయడమంటే అతనికి మహా ఇష్టం. సరదా కూడా. జురెల్ ఇటీవలే కాఫీ చేస్తుండగా.. ఆస్ట్రేలియన్ కాఫీ ఆంత్రప్రెన్యూర్ బరిస్తా కిర్క్ పియర్సన్ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ధ్రువ్ జురెల్ ఓ కాఫీ మెషీన్ పక్కన నిలబడి కాఫీ తయారు చేస్తూ ఆ వీడియోలో కనిపిస్తాడు. మెషీన్ నుంచి కాఫీకి అవసరమైన పదార్థాలు తీసుకోవడం, కాఫీని మరిగించి కప్పులో పోయడం వంటి దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. కాఫీని తయారు చేస్తున్న ప్రతి క్షణాన్ని జురెల్ ఆస్వాదించాడని పియర్సన్ తెలిపాడు. కాఫీపై వేడినీళ్లు పోయడం, కాఫీపై ఓ ఆకారం వచ్చేలా డిజైన్ వేయడం లాంటివి జురెల్ చేశాడు. అలాగే వివిధ రకాల కాఫీని కూడా జురెల్ ప్రయత్నించాడు. కాఫీ అన్నా, కాఫీ తయారు చేయడం అన్నా జురెల్‌కు ఎంత ఇష్టమో ఆ వీడియో చూస్తే తెలుస్తుందని పియర్సన్ పేర్కొన్నాడు. కాఫీ అంటే జురెల్‌కు పిచ్చి అని అతను చెప్పాడు.
Also Read:
నదిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్ల.. తల్లితో కలిపిన మత్స్యకారులు..
అమెరికా మరో అస్త్రం.. ఇరాన్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు..