ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. ఫైనల్‌లో శ్రీలంకపై విజయం
ABN , Publish Date - Sep 22 , 2026 | 02:01 PM
ఆసియా క్రీడల్లో మన భారత క్రికెట్ అమ్మాయిలు అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్‌లో తొలి స్వర్ణ పతకం సాధించారు. మహిళల క్రికెట్ ఫైనల్‌లో శ్రీలంకను భారత్ ఓడించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో మన భారత క్రికెట్ అమ్మాయిలు అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్‌లో తొలి స్వర్ణ పతకం సాధించారు. మహిళల క్రికెట్ ఫైనల్‌లో శ్రీలంకను భారత్ ఓడించింది. హర్మన్ ప్రీత్ సేన అద్భుత ప్రదర్శనతో మన దేశానికి స్వర్ణ పతకం దక్కింది. ఫైనల్‌లో లంకపై భారత్ 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన లంక 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ పడింది. కాగా.. అంతకుముందు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో పాక్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది.
Also Read:
రెండు నెలల వ్యాయామం.. ఖరీదైన బహమతులు.. దక్షిణ కొరియా కంపెనీ ఆఫర్ వైరల్..
బాలికపై లైంగిక వేధింపులు.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడికి బుల్లెట్ గాయాలు..
పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. అదనపు పింఛన్ పెంపు