రెండు నెలల వ్యాయామం.. ఖరీదైన బహమతులు.. దక్షిణ కొరియా కంపెనీ ఆఫర్ వైరల్..
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:45 PM
ఇటీవలి కాలంలో చాలా సంస్థలు తమ ఉద్యోగుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాయి. జిమ్ సభ్యత్వం, ఆరోగ్య పరీక్షలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలు వంటి ప్రోత్సాహకాలు అందిస్తుంటాయి. అయితే దక్షిణ కొరియాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో చాలా సంస్థలు తమ ఉద్యోగుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాయి. జిమ్ సభ్యత్వం, ఆరోగ్య పరీక్షలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలు వంటి ప్రోత్సాహకాలు అందిస్తుంటాయి. అయితే దక్షిణ కొరియాలోని ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గూచీ, చానెల్, ప్రాడా వంటి ఖరీదైన బ్రాండ్లకు చెందిన బహుమతులు అందిస్తామని ప్రకటించింది. సియోల్‌లో అదే సంస్థలో పనిచేస్తున్న భారతీయ మహిళ మాన్సీ అరోరా ఈ విషయాన్ని వెల్లడించారు (South Korea fitness incentive).
మాన్సీ అరోరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం.. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వరుసగా రెండు నెలల పాటు వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్న ఫొటోలను లేదా వీడియోలను టీమ్ లీడర్ లేదా మేనేజర్‌కు పంపాలి. రెండు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులకు కంపెనీ నుంచి ఖరీదైన బహుమతులు లభిస్తాయని ఆమె చెప్పారు. గూచీ, చానెల్, ప్రాడా వంటి లగ్జరీ బ్రాండ్ల వస్తువులను బహుమతులుగా అందిస్తారని ఆమె వెల్లడించారు (Indian woman South Korea).
ఉద్యోగుల్లో ఫిట్‌నెస్, ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగేలా చూసేందుకే తమ కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించినట్టు మాన్సీ పేర్కొన్నారు (Exercise rewards). ఉద్యోగులు ఎంత బిజీగా ఉన్నా తమ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ఆమె వివరించారు. దీంతో తనకు కూడా వ్యాయామం ప్రారంభించేందుకు ప్రేరణ లభించిందని ఆమె చెప్పారు. మాన్సీ అరోరా వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి..
ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..