Share News

గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటన.. బిల్డర్, కాంట్రాక్టర్లపై నాన్‌బెయిలబుల్ కేసులు

ABN , Publish Date - Aug 23 , 2026 | 08:44 AM

గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో శనివారం ఏడంతస్తుల భవనం కూలి మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.

గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటన.. బిల్డర్, కాంట్రాక్టర్లపై నాన్‌బెయిలబుల్ కేసులు
Gachibowli Building Collapse Case

హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో నిన్న (శనివారం) ఏడంతస్తుల భవనం కూలి మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు టైల్స్ కార్మికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారిస్తున్నారు. ఈ ప్రమాదంపై రాయదుర్గం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సాజిద్‌పై 105 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.


పోలీసుల అదుపులో నిందితుడు సాజిద్ ఉన్నాడు. అతి తక్కువ స్థలంలో, నాలాను ఆనుకుని ఏడంతస్తుల అక్రమ నిర్మాణం చేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. గతంలో అధికారులు సీజ్ చేసినా.. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ పనులు చేస్తున్నట్లుగా గుర్తించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డర్, కాంట్రాక్టర్లపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అంజయ్య నగర్‌లోని ఇతర అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు నివేదిక కోరారు. అనుమతులు లేని భవనాలపై కఠిన చర్యలు ఉంటాయని హైడ్రా అధికారులు హెచ్చరించారు.


వార్తలు కూడా చదవండి...

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ

డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు: మంత్రి దామోదర్

ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 09:06 AM