పెళ్లి బరాత్‌లో కత్తులతో యువకుల హల్‌చల్.. నలుగురి అరెస్ట్
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:54 PM
హైదరాబాద్ రెతిబౌలిలో వివాహ బరాత్‌లో కత్తులతో యువకులు హల్‌చల్ చేశారు. కత్తులు చేతబట్టి నడిరోడ్డుపై నలుగురు యువకులు డ్యాన్సులు చేశారు. సోషల్ మీడియాలో కత్తులతో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది.
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని రెతిబౌలిలో వివాహ బరాత్‌లో కత్తులతో యువకులు హల్‌చల్ చేశారు. కత్తులు చేతబట్టి నడిరోడ్డుపై నలుగురు యువకులు డ్యాన్సులు చేశారు. సోషల్ మీడియాలో కత్తులతో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోపై గుడిమల్కాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు. నవంబరు 22వ తేదీన రెతిబౌలిలోని బాబూ జగ్జీవన్ రావు భవన్ కమ్యూనిటీ హాల్ వద్ద ఈ ఘటన జరిగింది. తమ సోదరి వివాహ బరాత్‌లో కత్తులతో వారు హంగామా చేశారు.
కత్తులు ఊపుతూ ప్రజల్లో భయాందోళనలను యువకులు సృష్టించారు. వీడియో ఆధారంగా నృత్యం చేసిన నలుగురిని పోలీసులు గుర్తించారు. యువకులు కె. శ్రవణ్ కుమార్ (31), సంజయ్ కుమార్ (29), సందీప్ కుమార్ (28), దిలీప్ కుమార్ (26) అరెస్ట్ చేశారు. వారి నుంచి నాలుగు కత్తులు స్వాధీనం చేసుకుని, చట్టప్రకారం గుడిమల్కాపూర్ పోలీసులు చర్యలు చేపట్టారు. వివాహ వేడుకల్లో కత్తులు, మారణాయుధాల ప్రదర్శనపై పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలతో హల్‌చల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మూసీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం
మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి కానుక.. కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం
హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News