Share News

హైదరాబాద్‌లో అమానుషం.. మహిళను నమ్మించి గదికి తీసుకెళ్లి..

ABN , Publish Date - Nov 17 , 2026 | 08:41 AM

హైదరాబాద్ శివారులో దారుణ ఘటన జరిగింది. బధిర మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను గదిలో బంధించి ఇద్దరు కామాంధుల అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.

హైదరాబాద్‌లో అమానుషం.. మహిళను నమ్మించి గదికి తీసుకెళ్లి..
Hyderabad woman incident

హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శివారులో దారుణ ఘటన జరిగింది. బధిర మహిళపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను గదిలో బంధించి వారిద్దరు అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లో కుటుంబంతో కలిసి బాధితురాలు నివాసం ఉంటున్నారు. కుమారుడిని బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా మహిళపై నిందితుడు కన్నేశాడు. ఆమె తల్లిదండ్రులకు అనారోగ్యమంటూ సయ్యద్ జావీద్ అనే పరిచయస్తుడు నమ్మించాడు. తల్లిదండ్రులను చూపిస్తానంటూ ఆటోలో తీసుకెళ్లి మార్గమధ్యలో అతడు శీతలపానీయం ఇచ్చాడు. ఈ ఘటన అనంతరం బాధితురాలు స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆమెకు మెలకువ వచ్చేసరికి గదిలో అభ్యంతరకరంగా.. చేతులు చున్నీతో కట్టేసిన స్థితిలో ఉంది. గదిలో మరో నిందితుడు వెంకటేశ్ కూడా ఉండటంతో ఇద్దరూ కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. నిందితులు వెళ్లిపోయిన తర్వాత బయటకు వచ్చి తల్లి వద్దకు బాధితురాలు చేరారు. తనకు జరిగిన దారుణంపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల

భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 08:47 AM