Share News

ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలపై దృష్టి పెట్టాలి: సీపీ రమేశ్

ABN , Publish Date - Nov 26 , 2026 | 01:56 PM

రోడ్డు స్థలం పరిమితంగా ఉన్నందున ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలపై దృష్టి పెట్టాలని సీపీ రమేశ్ పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘సైబరాబాద్ మూవ్స్ ఇన్ 2026’ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలపై దృష్టి పెట్టాలి: సీపీ రమేశ్
cp ramesh

హైదరాబాద్, నవంబరు 26: రోడ్డు స్థలం పరిమితంగా ఉన్నందున ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలపై దృష్టి పెట్టాలని సీపీ రమేశ్ పేర్కొన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘సైబరాబాద్ మూవ్స్ ఇన్ 2026’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా.. రాయదుర్గంలోని టీ-హబ్ వేదికగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


ఈ సందర్భంగా సీపీ ఎం. రమేశ్ మాట్లాడారు. ‘ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 20 ఏళ్ల మైలురాయిని చేరుకోవడం గర్వకారణం. నేరాల బారిన పడేది 3-5% మంది మాత్రమే.. కానీ ట్రాఫిక్ సమస్య 100% ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. నగరమంటే కేవలం నివాస ప్రాంతం కాదు, అది ఆర్థిక కార్యకలాపాల కేంద్రం. రాష్ట్ర జీడీపీలో కోర్ అర్బన్ రీజియన్ వాటా 66 శాతం ఉందని ముఖ్యమంత్రి ఎప్పుడూ చెబుతుంటారు. రవాణా వ్యవస్థ వేగవంతం కావాలి. మనం వాహనాలను కాదు, ప్రజలను గమ్యస్థానాలకు చేర్చేలా ప్రణాళికలు రచించాలి.


రోడ్డు స్థలం పరిమితంగా ఉన్నందున ప్రత్యామ్నాయ ప్రజా రవాణా మార్గాలపై దృష్టి పెట్టాలి. ఈ విప్లవాత్మక మార్పులో 21 పౌర సమాజ సంస్థలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. టీ-హబ్, టీ-వర్క్స్ నుంచి 28 స్టార్టప్ కంపెనీలు ‘సైబరాబాద్ మూవ్స్’‌లో చేరడం శుభపరిణామం. ఈ సదస్సులో స్టార్టప్‌లు ప్రదర్శించిన వినూత్న ఆలోచనలు త్వరలోనే కార్యరూపం దాల్చుతాయి. హైదరాబాద్, సైబరాబాద్ సహా.. కోర్ అర్బన్ ప్రాంతాన్ని నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతాం. శబ్ద కాలుష్యం తగ్గించడం, గాలి నాణ్యతను మెరుగుపరచడమే మా ప్రధాన లక్ష్యం. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేని సులభతరమైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తాం’ అని సీపీ రమేశ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు

రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్.. రెండు లక్షల ఉద్యోగాలు మిథ్య అంటూ విమర్శలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 01:58 PM