దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీయల్ ఎక్స్పోగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026:సీఎస్ సంజయ్ జాజు
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:44 PM
దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీయల్ ఎక్స్పోగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని సీఎస్ సంజయ్ జాజు స్పష్టం చేశారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ జరుగుతుందని వెల్లడించారు.
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రీయల్ ఎక్స్పోగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని సీఎస్ సంజయ్ జాజు (Telangana CS Sanjay Jaju) స్పష్టం చేశారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ జరుగుతుందని వెల్లడించారు. ఈరోజు (గురువారం) సచివాలయంలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎస్ సంజయ్ జాజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం చేశారు.
పారిశ్రామిక దిగ్గజాలకు ఆహ్వానాలు..
గ్లోబల్ సమ్మిట్‌కు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలకు ఆహ్వానిస్తున్నట్లు సీఎస్ సంజయ్ జాజు తెలిపారు. ఇప్పటికే అనేక ప్రముఖ సంస్థలు భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేశాయని వివరించారు. ఈ సమ్మిట్‌కు ఆశించిన దానికంటే బాగా స్పందన వచ్చిందని పేర్కొన్నారు. సమ్మిట్‌లో రక్షా ఎక్స్పో, ఇండస్ట్రీయల్ ఎక్స్పో, ఫార్మా–లైఫ్ సైన్సెస్ ఎక్స్పో జరుగుతాయని వివరించారు. ప్రత్యేక ఆకర్షణగా స్టార్టప్ పెవిలియన్, క్రియేషన్ కార్నర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
యువత, జెన్-జీ ఆవిష్కరణలకు ప్రత్యేక వేదిక..
యువత, జెన్-జీ ఆవిష్కరణలకు ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నట్లు సీఎస్ సంజయ్ జాజు వెల్లడించారు. తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్, ఎడ్యుకేషన్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏరోబాటిక్ఎ - ఎయిర్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే హైదరాబాద్, ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని వివరించారు. డెలిగేట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. రైజింగ్ తెలంగాణ విజన్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తలను భాగస్వాములను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సీఎస్ సంజయ్ జాజు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యార్థుల యూనిఫాంలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: భట్టి విక్రమార్క
భూ సర్వేలో అవకతవకలకు తావులేకుండా చర్యలు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News