కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్..
ABN , Publish Date - Feb 27 , 2026 | 07:28 PM
శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ (శుక్రవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.
ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసేందుకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు. కోర్ అర్బన్ రీజియన్‌లో ఉన్న అన్ని స్ట్రీట్‌లైట్స్‌కు ప్రత్యేక నెంబర్ ఇచ్చి డ్యాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలని సూచించారు. టెక్నాలజీ ద్వారా సమస్య తలెత్తిన చోట వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. CURE పరిధిలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. హోటల్స్‌లోని కిచెన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలని దిశానిర్దేశం చేశారు.
తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఎప్పటికప్పుడు పరిశీలించేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. హోటల్స్‌కి రేటింగ్, సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని పరిశీలించాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో అడ్వాన్స్‌డ్ ఎక్విప్‌మెంట్ వినియోగించాలని మార్గనిర్దేశం చేశారు. నగరంలోని సిగ్నల్ జంక్షన్స్, సర్కిల్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలని సూచించారు. ఇందుకు ముందుగా కొన్ని ఏరియాలను గుర్తించి పైలట్ ప్రాజెక్టుగా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలిని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ కన్నుమూత
మావోయిస్టుల లొంగుబాటు పాలసీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక హామీ
Read Latest Telangana News And AP News And Telugu News