Share News

ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి అభినంద‌న‌లు

ABN , Publish Date - Jan 25 , 2026 | 07:25 PM

ప‌ద్మ పుర‌స్కారాల‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు.

ప‌ద్మ పుర‌స్కారాల‌కు ఎంపికైన వారికి సీఎం రేవంత్‌రెడ్డి అభినంద‌న‌లు
CM Revanth Reddy

హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ప‌ద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అభినంద‌న‌లు తెలిపారు. పద్మశ్రీ వరించిన 11 మంది తెలుగువారికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు, ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు నోరి ద‌త్తాత్రేయుడుకి ప‌ద్మ భూష‌ణ్‌ వరించడంపై హర్షం వ్యక్తం చేశారు. సైన్స్ అండ్ టెక్నాల‌జీ రంగం నుంచి గ‌డ్డమ‌ణుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాల‌సుబ్రహ్మణ్యన్‌, కుమార‌స్వామి తంగ‌రాజ్, వైద్య రంగంలో గూడూరు వెంక‌ట్ రావు, పాల్కొండ విజ‌యానంద్ రెడ్డి, ప‌శుసంవ‌ర్థక రంగంలో మామిడి రామారెడ్డి, క‌ళా రంగం నుంచి దీపికారెడ్డి, ముర‌ళీ మోహ‌న్‌, రాజేంద్ర ప్రసాద్‌, గ‌రిమెళ్ల బాల‌కృష్ణ ప్రసాద్ ల‌కు ప‌ద్మ శ్రీ పుర‌స్కారాలు ద‌క్కడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సేవా, క‌ళా, ఇత‌ర రంగాల్లో వారు చూపిన అంకిత‌భావం, సేవ‌ల‌తోనే ప్రతిష్టాత్మక పుర‌స్కారాలకు ఎంపిక‌య్యార‌ని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జాగృతి పార్టీలో చేరండి.. మహేశ్ గౌడ్‌కు కవిత ఆఫర్

సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 08:22 PM