Share News

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి జయశంకర్ ప్రేరణ: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jun 20 , 2026 | 07:43 PM

తెలంగాణ జాతిపిత జయశంకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కీర్తించారు.

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి జయశంకర్ ప్రేరణ:  సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాతిపిత జయశంకర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) నివాళి అర్పించారు. ప్రత్యేక తెలంగాణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కీర్తించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే జయశంకర్ ఉచ్ఛ్వాస నిశ్వాసలని కొనియాడారు. జయశంకర్ త్యాగాలను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరవదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. జయశంకర్ ఆశయ సాధనకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో విలీనం చేయడాన్ని జయశంకర్ వ్యతిరేకించారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విలీనంతో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించిన మహనీయుడు అని కీర్తించారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన ఘనత జయశంకర్‌దేనని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి జయశంకర్ మార్గదర్శి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి జయశంకర్ కృషి చిరస్మరణీయమని ప్రశంసించారు. మహనీయుడి ఆశయాల సాధనలో తమ ప్రభుత్వం ముందుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

వీకెండ్‌లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 20 , 2026 | 07:53 PM