శారదా పీఠం భూములపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Feb 28 , 2026 | 07:17 PM
కోకాపేట శారదా పీఠం భూములపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జలమండలికి కేటాయించిన భూ కేటాయింపులు రద్దు చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): కోకాపేట శారదా పీఠం భూములపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. జలమండలికి కేటాయించిన భూ కేటాయింపులు రద్దు చేశారు. ఆ భూములను శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణాల తాజా స్థితి తెలియజేయనందుకు.. అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి వివరాలు ఇవ్వాలని శారదా పీఠం ప్రతినిధులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. కోకాపేట భూముల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది.
99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై చర్చ..
సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ(శనివారం) సచివాలయంలో వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సమావేశంలో అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. మార్చి నుంచి జూన్ వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా పేలుళ్ల ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి..
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఇవాళ(శనివారం) భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కి చేరింది. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నాంపల్లి కోర్టుకి సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకంటే..
విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్
Read Latest Telangana News And AP News And Telugu News