హైదరాబాద్‌లో భారీ పేలుడు.. ఇద్దరికి గాయాలు
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:44 PM
హైదరాబాద్‌లో భారీ పేలుడు (కెమికల్ బ్లాస్ట్) జరిగింది. కాటేదాన్‌లోని బాటిళ్ల తయారీ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనలో సాయి వ్యక్తికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో భారీ పేలుడు (కెమికల్ బ్లాస్ట్) జరిగింది. కాటేదాన్‌లోని బాటిళ్ల తయారీ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో సాయి అనే వ్యక్తికి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటినా ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అలాగే కాలిపాదం సగం మేరకు తెగిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సీఎం సాకుకూలం.!
విశాంత్ర ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో రెండు టీమ్‌ల హస్తం.. సజ్జనార్ ఏమన్నారంటే..
హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News