Share News

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారుల విస్తృత సోదాలు..

ABN , Publish Date - Jul 31 , 2026 | 06:48 PM

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారుల విస్తృత సోదాలు..
CBI Raids

హైదరాబాద్, అమరావతి, జులై 31 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు (CBI Raids) నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్‌సీఎస్ షుగర్స్ లిమిటెడ్ కంపెనీతో పాటు డైరెక్టర్లకు సంబంధించిన పలు ప్రాంతాల్లోని ఆస్తులపై సోదాలు చేస్తున్నారు. చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రుణం తీర్చుకొని ఎన్సీఎస్ కంపెనీ నిర్వాహకులు ఎగ్గొట్టినట్లు అధికారులు తెలిపారు.


రూ.105 కోట్ల రుణం తీసుకొని ఎన్సీఎస్ షుగర్ కంపెనీ తిరిగి చెల్లించలేదని సీబీఐ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌, విజయనగరం, కాకినాడల్లోని పది ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. నకిలీ పత్రాలను అసలైనవిగా బ్యాంకుకు సమర్పించి ఎన్సీఎస్ కంపెనీ నిర్వాహకులు రుణ సదుపాయాలు పొందారని తెలిపారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


వార్తలు కూడా చదవండి...

2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి

నీట్ యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో కేంద్రం విప్లవాత్మక సంస్కరణలు

నీట్ పేపర్ లీక్ నిరసన.. పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 07:01 PM