శంషాబాద్‌లో ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం
ABN , Publish Date - Sep 28 , 2026 | 07:43 AM
గచ్చిబౌలికి చెందిన మహిళా ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆ క్యాబ్‌లో బయలుదేరిన సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలికి చెందిన మహిళా ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఆ క్యాబ్‌లో బయలుదేరిన సమయంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. మహిళా దగ్గర రూ.60 వేలు ఉండటం అతడు గమనించాడు. ఈ క్రమంలోనే తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద అతడు కారు రూట్ మార్చాడు. ఓఆర్ఆర్‌పై వెళ్లకుండా సర్వీస్ రోడ్డులోకి కారును డ్రైవర్ మళ్లించాడు.
కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో అతను కారు నిలిపివేశాడు. ఆ కారులోనే మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. భయంతో కారు నుంచి దిగి బాధితురాలు కేకలు వేయడంతో క్యాబ్ డ్రైవర్ భయపడి పరారయ్యాడు. కారులో ఉన్న రూ.60 వేల బ్యాగ్‌తో నిందితుడు ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదుతో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీజేపీ ఓటు చోరీ చేసి మోసం చేసింది: మంత్రి ఉత్తమ్
రేవంత్.. ఆ ఆధారాలు చూపెట్టు.. కేటీఆర్ సవాల్
హైదరాబాద్‌లో దారుణం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News And AP News And National News
And Telugu News