ఆ స్కామ్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బీఆర్ఎస్
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:27 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మంగళవారం లోక్ భవన్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతలు కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనున్నారు.
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఆధ్వర్యంలో మంగళవారం లోక్ భవన్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను(Governor jishnu dev varma) బీఆర్ఎస్ నేతలు కలిసి సింగరేణి కుంభకోణంపై వివరాలు అందజేయనున్నారు. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వారి లూటీకి సంబంధించి సాక్ష్యాధారాలతో కూడిన నివేదిక ఇవ్వనున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను బీఆర్ఎస్ నేతలు కోరనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పించారు.
ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఇంతటి భారీ స్కామ్‌లో భాగస్వాములైన సీఎం రేవంత్, ఇతర మంత్రులకు పదవిలో కొనసాగే నైతిక, రాజ్యాంగ పరమైన హక్కు లేదని స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని గవర్నర్‌కు తెలియజేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాగృతి పార్టీలో చేరండి.. మహేశ్ గౌడ్‌కు కవిత ఆఫర్
సింగరేణి స్కాంలో రేవంత్‌రెడ్డినే లబ్ధిదారుడు: హరీశ్‌రావు
Read Latest Telangana News And Telugu News