దోపిడీ దొంగలపై ఉక్కుపాదం మోపాలి: బండి సంజయ్
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:52 AM
కరీంనగర్‌లో నిన్న (మంగళవారం) అర్ధరాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు. ఈ దోపిడీపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరా తీశారు.
కరీంనగర్ జిల్లా, జులై 22 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో నిన్న (మంగళవారం) అర్ధరాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు. ఈ దోపిడీపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఆరా తీశారు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు బండి సంజయ్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దోపిడీ దొంగలపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్భందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయని సీపీ వివరించారు. ఈకేసు విచారణను ముమ్మరం చేశామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు.
ఎనిమిదిమంది దొంగతనం చేశారు: సీపీ గౌస్ ఆలం
అనంతరం కరీంనగర్ జిల్లా భగత్ నగర్ దోపిడీపై ఆ జిల్లా సీపీ గౌస్ ఆలం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో మొత్తం ఎనిమిదిమంది దొంగలు వచ్చి ఈ దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. తెలిసిన కుటుంబ సభ్యులే ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లుగా తమకు అనుమానం ఉందని తెలిపారు. ఈ కేసులో రూ.20 లక్షల నగదు, 60 తులాల బంగారం దోచుకెళ్లారని చెప్పారు. పక్కింటి టూ వీలర్లని కూడా ఎత్తుకెళ్లారని అన్నారు. ఈ దొంగతనం చేసింది మీరట్‌కి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఈకేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. మీరట్‌కి కూడా ఓ టీమ్‌ని పంపిస్తున్నామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి నష్టం జరగనివ్వబోం: ప్రధాని మోదీ
ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల
ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులకు నయా రూల్స్ .!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News