హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాన్ని నిషేధించడం దారుణం: బండి సంజయ్
ABN , Publish Date - Sep 21 , 2026 | 03:44 PM
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాన్ని నిషేధించడం దారుణమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల అరెస్ట్ దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాన్ని నిషేధించడం దారుణమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధుల అరెస్ట్ దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈరోజు (సోమవారం) హైదరాబాద్‌లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులను అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు.
ప్రతి ఏడాది ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని బండి సంజయ్ తెలిపారు. ఈసారి కూడా ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతించాల్సిందేనని స్పష్టం చేశారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శశిధర్‌తో పాటు అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు రాజకీయ నిమజ్జనం ఖాయం: బండి సంజయ్
కేసీఆర్, రేవంత్ నయా నిజాంలు.. ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు
మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News