ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు.. మాజీ హవల్దార్ లింకులపై పోలీసుల సమగ్ర దర్యాప్తు
ABN , Publish Date - Sep 15 , 2026 | 06:56 AM
సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్‌లోని ఆయుధాలను మాజీ హవల్దార్ మల్లేశ్ చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ చోరీ వెనుక అసలు కారణాలపై మల్లేశ్‌ను సమగ్రంగా పోలీసులు ప్రశ్నించనున్నారు.
సికింద్రాబాద్, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్‌లోని ఆయుధాలను మాజీ హవల్దార్ మల్లేశ్ చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ చోరీ వెనుక అసలు కారణాలపై మల్లేశ్‌ను సమగ్రంగా పోలీసులు ప్రశ్నించనున్నారు. ఆర్మీ ఆయుధాల చోరీ కేసులోని ప్రధాన నిందితుడిని ఈరోజు (మంగళవారం) పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మల్లేశ్‌ను 7రోజుల పాటు పోలీస్ కస్టడీకి సికింద్రాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో అతను ఉన్నాడు. ఏకే-47లు, పిస్తోళ్లు, మందుగుండు సామగ్రి చోరీపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేయనున్నారు.
ఈ ఆయుధాలను నాగర్‌కర్నూల్ జిల్లా జంగంరెడ్డిపల్లి గ్రామంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ హవల్దార్ మల్లేశ్ ఫోన్‌లో డిలీట్ చేసిన డేటాను కూడా దర్యాప్తు బృందాలు రికవరీ చేస్తున్నాయి. జింఖానా మైదానంలో మల్లేశ్ కలిసిన గుర్తు తెలియని వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో అతను పనిచేసిన ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లోని వ్యక్తులతో మల్లేశ్‌కు ఉన్న లింకులపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఆయుధాల చోరీకి మరో ఆర్మీ ఉద్యోగి సహకరించాడా.? అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయుధాలను ఎవరికి విక్రయించేందుకు, అప్పగించేందుకు చూశారు.? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ చోరీ వెనుక ఏదైనా నెట్‌వర్క్ ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అనుమానితులను కూడా పోలీసులు విచారించనున్నారు. దేశ భద్రతకు సంబంధించిన కేసు కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థలకు వివరాలు అందించే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్
అసెంబ్లీ ఘటన.. మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్వోలను విచారిస్తున్న పోలీసులు
శంషాబాద్‌లో బస్సు బీభత్సం.. హోటల్‌ల్లోకి దూసుకెళ్లి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News