Share News

కూల్‌ కూల్‌గా.. ఏసీ కన్నా కూలర్‌ బెటర్‌

ABN , Publish Date - May 09 , 2026 | 11:06 AM

వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత, వడదెబ్బతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 40- 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కూల్‌ కూల్‌గా.. ఏసీ కన్నా కూలర్‌ బెటర్‌
Summer, coolers

  • వేసవి వేడి నుంచి ఉపశమనం

హైదరాబాద్: వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత, వడదెబ్బతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 40- 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు, కూలర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.


  • ధనవంతులు ఏసీలు కొనుగోలు చేస్తుండగా, పేద, మధ్య తరగతి ప్రజలు కూలర్లు కొనుగోలు చేసేందుకు షాపుల వద్ద బారులు తీరుతున్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని షాపూర్‌నగర్‌, చింతల్‌, జగద్గిరిగుట్ట, సూరారం, గాజులరామారం, దుండిగల్‌, నిజాంపేట కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌ తదితర ప్రాంతాల వారు తమ స్థాయికి తగ్గట్లుగా కూలర్లను కొనుగోలు చేస్తున్నారు.


  • ఇవే కాకుండా ప్రధాన రోడ్లు, కూడళ్ల వద్ద విక్రయిస్తున్న మట్టి కుండల కొనేందుకు ఆశక్తి కనబరుస్తున్నారు. ఏసీల కన్నా కూలర్ల రేట్లు తక్కువగా ఉండడం, స్వచ్ఛమై గాలి వీయడం వలన ఎక్కువ మంది ఎయిర్‌ కూలర్ల కొనేందుకు ఆశక్తి చూపుతున్నారు.

  • ఇవి గాలిలోని వేడిని తీసుకొని చల్లని, స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూలర్లపైనే ఆధారపడుతున్నారు. నేడు రకరకాల కంపెనీల కూలర్లు అందుబాటు ఉన్నాయి. సైజును బట్టి, కంపెనీ బ్రాండ్‌లు రేట్లు రకరకాలుగా ఉన్నాయి. సింపనీ, బజాజ్‌, సాన్‌సూయ్‌, విగార్డ్‌, వంటి కంపెనీల బ్రాండ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.


city6.2.jpgకూలర్ల రకాలు: పర్సనల్‌ కూలర్‌: రూము సైజును బట్టి అమర్చుకొనేందుకు వీలుగా నేడు మార్కెట్‌లోకి రకరకాల కూలర్లు అందుబాటులోకి ఉన్నాయి. కూలర్లు ముఖ్యంగా నాలుగు రకాలుగా ఉంటాయి. వాటిలో పర్సనల్‌ కూలర్‌ ఒకటి. దీనిని చిన్న సైజు గదుల్లో అమర్చుకొనేందుకు వీలుగా ఉంటాయి. వీటినుంచి స్వచ్చమైన గాలి, గది అంతా చల్లదనాన్ని ఇస్తుంది. తక్కువ విస్తీర్ణం ఉండే గదుల్లో త్వరగా కూల్‌చేస్తాయి.


టవర్‌ కూలర్‌: ఎక్కవ విస్తీర్ణం ఉంటే టవర్‌ కూలర్‌ను ఉపయోగించాలి. ఈకూలర్‌ గాలిని నిలువుగా వెదజల్లుతుంది. ఫ్యాన్‌, వాటర్‌ కాంబినేషన్‌లో వేడిని పీల్చుకొని చల్లటి గాలినిస్తుంది. టవర్‌కూలర్‌ శబ్దంకూడా ఎక్కువగా ఉండదు. వేడిని పీల్చుకొని చల్లని గాలిని ఇచ్చే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది.


విండ్‌ కూలర్‌.. విండ్‌కూలర్స్‌ కిటికీల దగ్గర అమర్చుకొంటారు. దీని బాడీ బయట, కూలర్‌ ముందు భాగం లోపల ఉంటుంది. అందువల్ల గదిలో దీనికి ప్రత్యేక స్థలం కేటాయించాల్సిన అవసరం లేదు. పర్సనల్‌ కూలర్‌కన్నా మెరుగ్గా పనిచేస్తుంది. మెయింట్‌నెన్స్‌ కాస్త ఎక్కువ. ధర కూడా ఎక్కువే. మిగిలిన వాటితో పోలిస్తే తక్కువ విద్యుత్‌ ఖర్చు అవుతుంది.

డెస్టర్‌ కూలర్‌: ఉష్ణోగ్రత అధికం, గాలిలో తేమ శాతం తక్కువగా ఉండే ప్రాంతల కోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసినవి డస్టర్‌ కూలర్స్‌. నీటి నుంచి వేడిని తీసుకొని చల్లటి గాలులు అందిస్తుంది. ఎడారి ప్రాంతానికి ఇవి బాగా సరిపోతాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

టెక్నాలజీతో ఇంటికి భద్రత

గవర్నర్‌ నిర్ణయం సరైనదే!

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2026 | 11:11 AM