Share News

రవాణా శాఖ కొత్త రూల్.. వాహనాలపై కులం పేరు కనిపిస్తే రూ. 2 వేల ఫైన్..

ABN , Publish Date - May 09 , 2026 | 09:35 AM

బిహార్ రవాణా శాఖ వాహనదారులకు కీలక ఆదేశాలు జారీచేసింది. వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు రాసుకునే వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు ఉండరాదని స్పష్టం చేసింది.

రవాణా శాఖ కొత్త రూల్.. వాహనాలపై కులం పేరు కనిపిస్తే రూ. 2 వేల ఫైన్..
Bihar Vehicle Rules

పాట్నా, మే 9: బిహార్ రవాణా శాఖ వాహనదారులకు కీలక ఆదేశాలు జారీచేసింది. వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు రాసుకునే వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఇకపై వాహనాలపై కులానికి సంబంధించిన పేర్లు ఉండరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే పేర్లు రాసుకున్న వారు నెల రోజుల్లోగా వాటిని తొలగించాలని ఆదేశించింది. నెల రోజుల్లోగా పేర్లు తొలగించని వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం 2 వేల రూపాయల ఫైన్ వేయనున్నట్లు తెలిపింది. పేర్లు తొలగించడానికి వాహన యజమానులకు జూన్ మొదటి వారం వరకు గడువు ఇచ్చింది.


గడువు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ విస్తృత తనిఖీలు చేపట్టనుంది. కులం పేర్లు కనిపించిన వాహనాలపై మోటార్ వెహికల్ యాక్ట్ 1988లోని సెక్షన్ 177 కింద 500 రూపాయల నుంచి సెక్షన్ 179 కింద 2 వేల రూపాయల వరకు ఫైన్ వేయనుంది. చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వాహన యజమానులు వెంటనే కులం పేర్లను తొలగించాలని రవాణ శాఖ సూచించింది. ఈ కొత్త రూల్‌కు సంబంధించి జిల్లా రవాణా అధికారులకు ఇప్పటికే రవాణా శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

విజయ్‌కు మద్దతుగా సంతకం పెట్టిన ఎమ్మెల్యే కామరాజ్.. వీడియో విడుదల చేసిన టీవీకే..

మూడోసారి ఎదురుదెబ్బ.. విజయ్ ఆశలపై నీళ్లు చల్లిన టీటీవీ దినకరన్..

Updated Date - May 09 , 2026 | 11:08 AM